Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే

ఆ విద్యార్థులు రాసిన అక్షరాలు చూస్తే.. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా అని అనిపిస్తుంది. అది నిజమైన చేతి రాతేనా? లేక కంప్యూటర్‌ ప్రింటా? అనే అనుమానం కలుగుతుంది.

Updated : 26 Mar 2023 07:38 IST

ఆ విద్యార్థులు రాసిన అక్షరాలు చూస్తే.. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా అని అనిపిస్తుంది. అది నిజమైన చేతి రాతేనా? లేక కంప్యూటర్‌ ప్రింటా? అనే అనుమానం కలుగుతుంది. అంత అద్భుతంగా ముత్యాల్లాంటి అక్షరాలు రాస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. స్పెషల్‌ క్లాసులు వింటూ, నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తూ.. కాలిగ్రఫీలో మెరుగవుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ జిల్లా కరౌలీ గ్రామంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కాలిగ్రఫీ కోర్సు నిర్వహిస్తున్నారు. టీచర్ల ప్రోత్సాహంతో విద్యార్థులు.. చేతి రాతలో నైపుణ్యం సంపాదిస్తున్నారు. ఈ పాఠశాలలో పని చేసే నరేంద్ర గోస్వామి అనే ఉపాధ్యాయుడికి.. కాలిగ్రఫీ శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయనే.. విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని