2024కల్లా అమెరికాతో సమానంగా హైవేలు

దేశంలోని హైవేలు 2024కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Updated : 27 Mar 2023 05:35 IST

త్వరలో భారత్‌మాల-2కు కేబినెట్‌ ఆమోదం: గడ్కరీ

రాంచీ: దేశంలోని హైవేలు 2024కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. భారత్‌మాల-2కు త్వరలో కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించనుందని చెప్పారు. ఆదివారమిక్కడ ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘ఈ ఏడాది రూ.16,000 కోట్లతో రైలు వంతెనలను నిర్మించనున్నాం. ఐదేళ్లలో ఆ బడ్జెట్‌ను రూ.50,000 కోట్లకు పెంచుతాం. పితోర్‌గఢ్‌ మీదుగా కైలాశ్‌ మానస సరోవర్‌కు చేపట్టిన హైవే నిర్మాణం 93శాతం పూర్తయింది. భారత్‌మాల-2 కింద 5,000 కిలోమీటర్ల హైవేలను తొలుత నిర్మిస్తాం. మొత్తం ఈ ప్రాజెక్టు కింద 35,000 కిలోమీటర్లను నిర్మించాలనేది లక్ష్యం. దీనిద్వారా 580 జిల్లాలను అనుసంధానం చేయనున్నాం. 600 జిల్లాల మధ్య రాకపోకలపై సాంకేతికంగా అధ్యయనం చేసి కారిడార్లను చేపడుతున్నాం. ఝార్ఖండ్‌లో రూ.70,000 కోట్లతో 7 గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలను నిర్మిస్తున్నాం’ అని గడ్కరీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని