పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్‌!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే

రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన మహిళా వైద్యురాలు అనిత.. పానీపూరీ వ్యాపారిగా మారిపోయారు.

Published : 27 Mar 2023 05:07 IST

రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన మహిళా వైద్యురాలు అనిత.. పానీపూరీ వ్యాపారిగా మారిపోయారు. రోగులను పరీక్షించి మందులు ఇవ్వాల్సిన ఆమె.. రోడ్డుపై పానీపూరీ బండి నడుపుతున్నారు. తాళం వేసిన ఆస్పత్రి ఎదుటే ఆమె ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే డాక్టర్‌ అనిత ఇలా నిరసన తెలుపుతున్నారు. ఆస్పత్రి బోర్డు కూడా తొలగించి  ‘అనిత.. పుచ్కావాలీ’ అని పానీపూరి దుకాణం బోర్డు పెట్టారు. తన నేమ్‌బోర్డ్‌ను సైతం మాజీ ప్రైవేట్‌ డాక్టర్‌ అని మార్చుకున్నారు. ఇలాగే మరో వైద్యుడు తన ఆస్పత్రిని పరాఠా సెంటర్‌గా మార్చారని ఆమె తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ఆందోళనల నడుమే ‘రైట్‌ టు హెల్త్‌’ బిల్లును రాజస్థాన్‌ ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ట్రంలోని ఏ పౌరుడైనా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందవచ్చు. ఈ చట్టం పేరుతో రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని