వైద్యరంగంలో కృత్రిమ మేధ వినియోగానికి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు

జీవ వైద్య పరిశోధనలు, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో అనుసరించాల్సిన నైతిక సూత్రాలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) దేశంలో తొలిసారిగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published : 27 Mar 2023 04:39 IST

దిల్లీ: జీవ వైద్య పరిశోధనలు, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో అనుసరించాల్సిన నైతిక సూత్రాలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) దేశంలో తొలిసారిగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యరంగంలో ఏఐ ప్రధానంగా రోగి నుంచి తీసుకున్న డేటా ఆధారంగా పనిచేస్తుందని, దీంతో ఆశ్రిత పక్షపాతం, డేటా నిర్వహణ, స్వయంప్రతిపత్తి, వృత్తిపరమైన పోటీ, గోప్యత తదితర అంశాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశమున్నందున మార్గదర్శకాలు అత్యవసరమని వైద్య పరిశోధన విభాగం, ఐసీఎమ్‌ఆర్‌కు చెందిన కృత్రిమ మేధ విభాగం తమ నివేదికలో వెల్లడించాయి. అయితే ఇవి వైద్య రంగంలో ఏఐ పాత్రను పరిమితం చేయడానికి కాదని, కృత్రిమ మేధను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు సురక్షితమైన విధానాల్లోనే దానిని ఉపయోగించడానికి మాత్రమేనని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని