Supreme Court: లోక్‌సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్‌ అహ్మద్‌ పిటిషన్‌పై విచారణ నేడు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న తరుణంలో- ఇలాంటి కేసే మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు వస్తుండడం ఉత్కంఠ రేపుతోంది.

Updated : 28 Mar 2023 08:08 IST

ఎంపీ అనర్హత నిర్ణయాన్ని లోక్‌సభ సచివాలయం
వెనక్కి తీసుకోకపోవడంపై కేసు...

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న తరుణంలో- ఇలాంటి కేసే మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు వస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అనర్హత వేటు పడిన లక్షద్వీప్‌ మాజీ ఎంపీ, ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దిగువ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఫైజల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేరళ హైకోర్టు స్టే విధించినప్పటికీ తన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. ఈ కేసును సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం విచారించనుంది. తనపై లోక్‌సభ సచివాలయం విధించిన అనర్హతను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఫైజల్‌ కోరుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు రాహుల్‌గాంధీ కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని