ఎలాంటి చర్చ లేకుండానే కేంద్ర బడ్జెట్‌ 2023-24కు ఆమోదం

కేంద్ర బడ్జెట్‌ 2023-24ను పార్లమెంటు ఆమోదించింది. సోమవారం ఆర్థిక బిల్లు-2023ను ఎలాంటి చర్చ జరపకుండానే రాజ్యసభ ఆమోదించి లోక్‌సభకు పంపడంతో బడ్జెటరీ కసరత్తు పూర్తైంది.

Published : 28 Mar 2023 04:46 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ 2023-24ను పార్లమెంటు ఆమోదించింది. సోమవారం ఆర్థిక బిల్లు-2023ను ఎలాంటి చర్చ జరపకుండానే రాజ్యసభ ఆమోదించి లోక్‌సభకు పంపడంతో బడ్జెటరీ కసరత్తు పూర్తైంది. గత వారం కూడా ఎలాంటి చర్చ జరగకుండానే ద్రవ్యబిల్లుకు లోక్‌సభ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. సోమవారం రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక బిల్లును సవరణతో ప్రవేశపెట్టారు. సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) రేట్లలో తప్పిదాన్ని సవరించారు. ఆ సమయంలో విపక్షాలు అదానీ, రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు తదితర అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల రణగొణ ధ్వనులు మధ్యే ఆర్థిక బిల్లుతో పాటు.. జమ్ము-కశ్మీర్‌ బడ్జెట్‌ 2023-24, ద్రవ్య వినిమయ బిల్లులు కూడా సభ ఆమోదం పొందినట్లు.. లోక్‌సభకు తిరిగి పంపుతున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని