నమీబియా చీతాల్లో ‘సాశా’ మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విషాదం చోటుచేసుకుంది. నమీబియా నుంచి గత సెప్టెంబరులో ఇక్కడకు రప్పించిన 8 చీతాల్లో ఒకటి మృత్యువాత పడింది.

Updated : 28 Mar 2023 05:55 IST

భారత్‌కు రాకముందే దానికి మూత్రపిండాల వ్యాధి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విషాదం చోటుచేసుకుంది. నమీబియా నుంచి గత సెప్టెంబరులో ఇక్కడకు రప్పించిన 8 చీతాల్లో ఒకటి మృత్యువాత పడింది. మూత్రపిండాల సంబంధ వ్యాధితో ‘సాశా’ అనే ఆడ చీతా సోమవారం మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ‘‘ఈ నెల 22న ‘సాశా’ అస్వస్థతతో కనిపించింది. దీంతో దాన్ని క్వారంటైన్‌లోకి తరలించి రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించాం. ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది. గతంలో దాని ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకొనేందుకు నమీబియా అధికారులను సంప్రదించగా, భారత్‌కు తీసుకురాకముందే ఆ చీతాకు కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తేలింది. సాశాను కాపాడటానికి స్థానిక వైద్యులతోపాటు నమీబియా నిపుణులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం దక్కలేదు’’ అని అధికారులు తెలిపారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన మిగిలిన ఏడు చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు