‘యువతీ యువకులకు ఒకే వివాహ వయసు’

చట్టబద్ధమైన కనీస వివాహ వయసు (21 ఏళ్లు) యువకులకు, యువతులకు ఒకే విధంగా ఉండాలని, ఇందుకోసం శాసనాన్ని రూపొందించేలా పార్లమెంటుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Published : 28 Mar 2023 05:10 IST

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

దిల్లీ: చట్టబద్ధమైన కనీస వివాహ వయసు (21 ఏళ్లు) యువకులకు, యువతులకు ఒకే విధంగా ఉండాలని, ఇందుకోసం శాసనాన్ని రూపొందించేలా పార్లమెంటుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చట్టసభ పరిధిలోకి వచ్చే ఈ అంశాన్ని విచారణకు చేపట్టబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. కనీస వివాహ వయసులో మహిళలు, పురుషులకు మధ్య సమానత్వం పాటించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 20న నిరాకరించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని