ఫలించిన తేజస్వి కోరిక

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, రాజశ్రీ దంపతులకు సోమవారం పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని తేజస్వి ట్విటర్‌లో పంచుకున్నారు.

Published : 28 Mar 2023 05:10 IST

ఆడబిడ్డ పుట్టడంతో సంబరాలు

పట్నా: బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, రాజశ్రీ దంపతులకు సోమవారం పండంటి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని తేజస్వి ట్విటర్‌లో పంచుకున్నారు. దీంతోపాటు కుమార్తెను చేతుల్లో పట్టుకుని మురిపెంగా చూస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ శుభవార్తతో తేజస్వి కుటుంబ సభ్యులతోపాటు ఆర్జేడీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తేజస్వి సోదరుడు తేజ్‌ప్రతాప్‌ అసెంబ్లీ ఆవరణలో మిఠాయిలు పంచారు. ‘‘నేను పెదనాన్నను అయ్యాను. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది’’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో తేజస్వి మాట్లాడుతూ తనకు తొలి సంతానంగా అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన కోరిక ఫలించి ఆడబిడ్డ జన్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు