ధన్‌ఖడ్‌, కిరణ్‌ రిజిజులపై వేటు వేయండి

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు న్యాయవ్యవస్థ, కొలీజియంలపై చేసిన విమర్శలకు వ్యతిరేకంగా బొంబాయి న్యాయవాదుల సంస్థ(బీఎల్‌ఏ) మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Published : 29 Mar 2023 04:49 IST

సుప్రీంకోర్టులో బొంబాయి  న్యాయవాదుల సంస్థ పిటిషన్‌

దిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు న్యాయవ్యవస్థ, కొలీజియంలపై చేసిన విమర్శలకు వ్యతిరేకంగా బొంబాయి న్యాయవాదుల సంస్థ(బీఎల్‌ఏ) మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంతకుముందు ఆ సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కిరణ్‌ రిజిజు, జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఇద్దరూ తమ వ్యాఖ్యలు, ప్రవర్తన ద్వారా మన దేశ రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై అవిశ్వాసం వ్యక్తం చేశారని బీఎల్‌ఏ ఆరోపించింది. వారిద్దరూ ఆయా పదవుల్లో కొనసాగడానికి అనర్హులుగా ప్రకటించాలని కోరింది. రాజ్యాంగంపై విశ్వాసం కలిగి ఉంటామని ధన్‌ఖడ్‌, కిరణ్‌ రిజిజు ప్రమాణం చేసిన విషయాన్ని పిటిషనర్‌ గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు