రాహుల్‌పై కేసును గమనిస్తున్నాం: అమెరికా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు..దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Updated : 29 Mar 2023 05:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు..దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా దీనిపై అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. రాహుల్‌ గాంధీ కేసును తాము గమనిస్తున్నామని పేర్కొంది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. ‘‘ఏ ప్రజాస్వామ్యానికైనా.. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు. భారత కోర్టుల్లో రాహుల్‌ గాంధీ కేసును మేం గమనిస్తున్నాం. భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం. మా రెండు దేశాలకు కీలక అంశాలైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్‌ చేస్తూనే ఉంటాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ సోమవారం ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు