త్వరలోనే ఇల్లు ఖాళీ చేస్తా: రాహుల్‌

దిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇచ్చిన నోటీసులను గౌరవిస్తున్నానని, ఇంటిని ఖాళీ చేస్తానని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 29 Mar 2023 05:26 IST

దిల్లీ: దిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇచ్చిన నోటీసులను గౌరవిస్తున్నానని, ఇంటిని ఖాళీ చేస్తానని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో శిక్ష పడి లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన ఆయనకు.. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్‌ నుంచి లేఖ వచ్చింది. దీనికి మంగళవారం రాహుల్‌ గాంధీ సమాధానమిచ్చారు. దిల్లీ తుగ్లక్‌ లేన్‌లోని 12వ నంబరు బంగళాను ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘ఇల్లు ఖాళీ చేయాలని నాకు లేఖ రాసినందుకు కృతజ్ఞతలు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యా. ఇది ప్రజల ఆదేశం. దానివల్లే ఈ ఇంట్లో ఉన్నా. నేను ఇక్కడ గడిపిన సంతోషకరమైన జ్ఞాపకాలను జీవితంలో మరచిపోలేను. నా హక్కులకు భంగం కలగకుండా మీ లేఖలో ఉన్న ఆదేశాలకు నేను కట్టుబడి ఉంటా’ అని లోక్‌సభ సెక్రటేరియట్‌ అధికారులకు రాహుల్‌ లేఖ రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు