క్షయ కేసుల అంచనాకు భారత్‌ సొంత నమూనా

క్షయ కేసుల వ్యాప్తిని అంచనా వేసేందుకు దేశీయ స్థాయిలో స్వీయ గణాంక నమూనాను అభివృద్ధిపరిచిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.

Published : 29 Mar 2023 05:33 IST

స్వీయ గణాంక విధానం కలిగిన తొలి దేశంగా గుర్తింపు

దిల్లీ: క్షయ కేసుల వ్యాప్తిని అంచనా వేసేందుకు దేశీయ స్థాయిలో స్వీయ గణాంక నమూనాను అభివృద్ధిపరిచిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ నమూనాను ఉపయోగించి క్షయ వ్యాధి వ్యాప్తి, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి ఏడాది మార్చి నెలాఖరు కల్లా మన దేశం అందుబాటులో ఉంచగలదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతి అక్టోబరులో విడుదల చేసే ఇదే తరహా సమాచారం కన్నా కొన్ని నెలల ముందే మన దేశం సంబంధిత డేటాను వెల్లడించగలదని అధికారులు తెలిపారు. ఈ స్వీయ గణాంక నమూనాను గత వారం వారణాసిలో జరిగిన 36వ టీబీ వ్యాప్తి నిరోధక సమావేశంలో 40 దేశాల ప్రతినిధులకు మన దేశం వివరించింది. వీరిలో చాలా దేశాల ప్రతినిధులు ఈ నమూనాను ప్రశంసించారు. తమ దేశాల్లోనూ దీనిని అమలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం మనదేశంలో 2021లో క్షయ వ్యాప్తి రేటు (ప్రతి పదివేల మందిలో) 210గా ఉంది. మన దేశం అభివృద్ధిచేసిన స్వీయ గణాంక నమూనా ప్రకారం 2022లో టీబీ వ్యాప్తి రేటు 196 మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని