లోయలోకి దూసుకెళ్లిన శబరిమల యాత్రికుల బస్సు

కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది.

Published : 29 Mar 2023 05:40 IST

కేరళలో 62 మందికి తీవ్ర గాయాలు

కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో డ్రైవర్‌ సహా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 9 మంది చిన్నారులు సహా మొత్తం 64 మంది ఉన్నారు. వారంతా తమిళనాడులోని మయిలాదుతురయ్‌ జిల్లా వాసులని అధికారులు గుర్తించారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా వారు ప్రమాదం బారిన పడ్డారు. పథనంతిట్ట జిల్లా నిలక్కల్‌ సమీపంలోని ఇలావుంకల్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం బస్సు బోల్తా పడి లోయలోకి దూసుకెళ్లింది. స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను కొట్టాయం వైద్య కళాశాల ఆసుపత్రి సహా పలు వైద్యశాలలకు తరలించారు. పైంకుని పండగను పురస్కరించుకుని శబరిమల ఆలయాన్ని దేవస్థానం బోర్డు సోమవారం తెరిచిన సంగతి గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు