హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్స్‌

కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ నుంచి కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Published : 29 Mar 2023 05:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ నుంచి కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఏప్రిల్‌ 25 నుంచి తెరుస్తారని సమాచారం. ఇప్పటి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ నుంచి కూడా టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీనికోసం హెలియాత్ర పేరిట https://heliyatra.irctc.co.in/ ప్రత్యేక పోర్టల్‌ను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు