మాదకద్రవ్యాల కేసులో నిందితులకు బెయిలొద్దు: అలహాబాద్‌ హైకోర్టు తప్పు చేసిందన్న సుప్రీం

మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం కేసులో బెయిలు మంజూరు చేయొద్దని, నిందితుడు నేరం చేయలేదని కోర్టు సమాధానపడితేనే బెయిలు గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 29 Mar 2023 06:05 IST

మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం కేసులో బెయిలు మంజూరు చేయొద్దని, నిందితుడు నేరం చేయలేదని కోర్టు సమాధానపడితేనే బెయిలు గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన బెయిలు ఉత్తర్వులను జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ల ధర్మాసనం తోసిపుచ్చింది. నిందితుడి వద్ద దొరికిన గంజాయి (దాదాపు 4 కేజీలు) వ్యాపార పరిమాణంలో ఉందని, బెయిలుపై బయటకు వెళ్లాక అతడు మళ్లీ అదే వ్యాపారం చేయడన్న నిర్ధారణను కోర్టు నమోదు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో అలహాబాద్‌ హైకోర్టు స్పష్టంగా తప్పు చేసినట్లుగా తాము అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని