ప్రజాస్వామ్య విజయానికి మనమే నిదర్శనం: మోదీ

భారతదేశమంటే ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అనీ, ప్రజాస్వామ్య విజయానికి మనమే నిదర్శనమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 04:40 IST

దిల్లీ: భారతదేశమంటే ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అనీ, ప్రజాస్వామ్య విజయానికి మనమే నిదర్శనమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సవాళ్లు అనేకం ఎదురైనా వాటిని తోసిరాజని వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలుస్తోందని, ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదని ప్రపంచానికి ఇది చాటుతోందని చెప్పారు. బుధవారం ‘ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు 2023’ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. ‘‘ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధుల్ని ఎంచుకోవడమనేది మిగతా ప్రపంచానికంటే ముందే భారత్‌లో ఉంది. తమ నేతను ఎన్నుకోవడం ప్రజల ప్రథమ కర్తవ్యమని మహాభారతం చెబుతోంది. విస్తారమైన సంప్రదింపుల ప్రక్రియ ద్వారా రాజకీయాధికారాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను మన పవిత్ర వేదాలు చెబుతున్నాయి’’ అని మోదీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు