20 రూపాయలకే మినీ హోటల్‌లో గది

పశ్చిమబెంగాల్‌లోని ఓ మినీ హోటల్లో కేవలం రూ.20 చెల్లించి గదిని అద్దెకు  తీసుకోవచ్చు. దీంతో పాటుగా అక్కడ అతి తక్కువ ధరకే భోజనం కూడా లభిస్తుంది.

Published : 30 Mar 2023 06:02 IST

పశ్చిమబెంగాల్‌లోని ఓ మినీ హోటల్లో కేవలం రూ.20 చెల్లించి గదిని అద్దెకు  తీసుకోవచ్చు. దీంతో పాటుగా అక్కడ అతి తక్కువ ధరకే భోజనం కూడా లభిస్తుంది. అయితే.. ఈ హోటల్‌ నడుపుతున్నది ఓ రిక్షావాలా కావడం గమనార్హం. శిలిగుడి ప్రాంతంలో పని చేయడం కోసం రోజువారీ కూలీలు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు కొన్నిసార్లు రెండు, మూడు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇలాంటి సమయాల్లో వారు తమకొచ్చే రోజువారీ కూలీతో సాధారణ హోటల్లో గదిని అద్దెకు తీసుకునే అవకాశం ఉండదు. వీరిని దృష్టిలో ఉంచుకుని మహేంద్ర సర్కార్‌ అనే రిక్షావాలా ఇనుప రేకుల సహాయంతో తన ఇంటినే రెండంతస్తుల భవనంగా మార్చాడు. ఇందులోని గదుల్లో.. ఓ బెడ్‌, లైట్‌, ఫ్యాన్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ వంటి సౌకర్యాలను కల్పించాడు. 24 గంటల పాటు బస చేయడానికి కేవలం రూ.20 వసూలు చేస్తున్నాడు. దీంతో పాటుగా శాకాహార భోజనం రూ.30, చేపలు రూ.50, చికెన్‌ మీల్స్‌ రూ.60కే అందిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు