సరైన సమాచారమే ప్రజాస్వామ్యానికి ఊపిరి

సరైన సమాచారం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంపై తగిన విధంగా చర్యలు తీసుకుని, వాటిని కట్టడి చేసేందుకు సిద్ధం కావాలని ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఐఎస్‌) అధికారులకు రాష్ట్రపతి సూచించారు.

Published : 30 Mar 2023 05:20 IST

ఐఐఎస్‌ అధికారులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దిల్లీ: సరైన సమాచారం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంపై తగిన విధంగా చర్యలు తీసుకుని, వాటిని కట్టడి చేసేందుకు సిద్ధం కావాలని ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఐఎస్‌) అధికారులకు రాష్ట్రపతి సూచించారు. శిక్షణలో ఉన్న అధికారులతో పాటు కొందరు ఐఐఎస్‌ అధికారులు బుధవారం తనను కలిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుత సమయంలో సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, అందువల్ల అంతే వేగంగా తప్పుడు సమాచారం కూడా వెళ్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తప్పుడు సమాచారంపై పోరాడే బాధ్యతను అధికారులు తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిబద్ధతతో పనిచేయాలన్నారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసి తప్పుడు కథనాలు ప్రచారం చేసేవారిని అడ్డుకోవాలని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు