చిన్నప్పుడు నన్ను ఇద్దరు లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేదు: జిల్లా కలెక్టర్‌

ఆరేళ్ల వయసున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని.. కేరళకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిణి వెల్లడించారు.

Updated : 30 Mar 2023 09:02 IST

ఆరేళ్ల వయసున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని.. కేరళకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిణి వెల్లడించారు. దీంతో చిన్నతనంలోనే మానసిక క్షోభకు గురైనట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో పథనంథిట్ట జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్‌. అయ్యర్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘‘ఇద్దరు వ్యక్తులు నన్ను ఆప్యాయంగా పిలిచారు. నేను వాళ్ల వద్దకు వెళ్లాను. వాళ్లు ఎందుకు ముట్టుకున్నారో, ఆప్యాయంగా మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు. వాళ్లు నా దుస్తులు విప్పినప్పుడు బాధగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాను. మా తల్లిదండ్రుల సహకారంతో నేను ఆ బాధ నుంచి తప్పించుకోగలిగాను. ఆ తర్వాత వారు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశాను. కానీ, వారు నాకు కనిపించలేదు. వారి ముఖాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి’’ అని ఆమె తన చేదు జ్ఞాపకం గురించి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని