భాజపా ఎంపీ గిరీశ్‌ బాపట్‌ కన్నుమూత

భాజపా సీనియర్‌ నేత, పుణె ఎంపీ గిరీశ్‌ బాపట్‌ (72) అనారోగ్యంతో కన్నుమూశారు.

Published : 30 Mar 2023 05:53 IST

పుణె: భాజపా సీనియర్‌ నేత, పుణె ఎంపీ గిరీశ్‌ బాపట్‌ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా పుణెలోని దీనానాథ్‌ మంగేష్కర్‌ ఆసుపత్రిలో ప్రాణాధార వ్యవస్థపై చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కస్బాపేఠ్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 మధ్య మంత్రిగానూ సేవలందించారు. 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1950 సెప్టెంబరు 3న తలేగావ్‌ దాభాడేలో జన్మించిన గిరీశ్‌ తొలినాళ్లలో ఆరెస్సెస్‌లో పనిచేశారు. అత్యయిక స్థితి సమయంలో నాసిక్‌ జైల్లో 19 నెలలు గడిపారు. కార్పొరేటర్‌గా మొదలు పెట్టి ఎంపీ స్థాయికి ఎదిగారు. పుణె జిల్లాలో పార్టీలకతీతంగా రాజకీయ నేతలకు మార్గదర్శిగా నిలిచారు. గిరీశ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘గిరీశ్‌ మృతి విషాదకరం. ఆయన సమాజానికి అంకితభావంతో సేవచేశారు. మహారాష్ట్ర అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. పుణె అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. గిరీశ్‌ మరణంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శిందే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని