సివిల్‌ సర్వెంట్ల షేర్‌ మార్కెట్‌ లావాదేవీలపై ఆరా

అఖిల భారత సర్వీస్‌ అధికారుల స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఒక కేలండర్‌ ఏడాదిలో షేర్లు, ఇతర పెట్టుబడి లావాదేవీల విలువ 6 నెలల మూల వేతనం కంటే అధికంగా ఉంటే ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది.

Published : 31 Mar 2023 04:29 IST

వివరాలివ్వాలని కేంద్రం ఆదేశం

దిల్లీ: అఖిల భారత సర్వీస్‌ అధికారుల స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఒక కేలండర్‌ ఏడాదిలో షేర్లు, ఇతర పెట్టుబడి లావాదేవీల విలువ 6 నెలల మూల వేతనం కంటే అధికంగా ఉంటే ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనలు (1968)లోని రూల్‌ 16(4) ప్రకారం ఏటా వెల్లడించే వివరాలకు తాజాగా సమర్పించాల్సిన సమాచారం అదనమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌లలో ఉన్నవారందరికీ వర్తిస్తాయని తెలిపింది. రూల్‌ 14(1) ప్రకారం.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్న ఏ వ్యక్తీ షేర్లు, ఇతర ఊహాజనిత పెట్టుబడులు పెట్టడం సరికాదని గుర్తు చేసింది. షేర్లు, సెక్యూరిటీలు, డిబెంచర్ల వంటివి చరాస్తుల కిందకు వస్తాయని పేర్కొంది. వీటిలో వ్యక్తిగత లావాదేవీల విలువ 2 నెలల మూల వేతనం కంటే అధికంగా ఉంటే ఆ వివరాలనూ రూల్‌ 16(4) ప్రకారం.. సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది. మార్చి 20వ తేదీన కేంద్రం ఈ ఆదేశాలను జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు