కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీ

నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం పరిశీలించారు.

Published : 31 Mar 2023 05:21 IST

నిర్మాణ పనుల పరిశీలన... కార్మికులతో సంభాషణ

ఈనాడు, దిల్లీ: నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం పరిశీలించారు. కొత్త భవనంలోని రాజ్యసభ, లోక్‌సభ ఛాంబర్లను సందర్శించి అక్కడ సమకూర్చుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట సమయాన్ని ఆయన వెచ్చించారు. నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ఉన్నారు. వచ్చే వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరిగే సూచనలున్నాయి. 2021 సెప్టెంబరులోనూ నరేంద్ర మోదీ కొత్త భవన సముదాయాన్ని పరిశీలించి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అప్పుడు కూడా కార్మికులతో మాట్లాడారు. ఈ భవనానికి 2020 డిసెంబరు 10న ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని