Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఓ ఆలయంలో బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఇందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు.

Updated : 31 Mar 2023 06:51 IST

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఓ ఆలయంలో బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఇందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు. ఈ బంగారు మహాకావ్య రచనకు 530 పేజీలను ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించారు. 222 తులాల బంగారు సిరా వినియోగించారు. పుస్తకం బరువు సుమారు 19 కిలోల వరకు ఉంటుంది. బంగారంతోపాటు 10 కిలోల వెండి, 4 వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, నీలమణులతో ఈ రామాయణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. దీని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ రామాయణ రచనకు 1981లో రామ్‌భాయ్‌ అనే భక్తుడు ప్రత్యేకించి పుష్యమీ నక్షత్రంలో శ్రీకారం చుట్టారు. రాయడానికి మొత్తం 9 నెలల 9 గంటల సమయం పట్టింది. ఈ మహాయజ్ఞంలో మొత్తం 12 మంది రామభక్తులు సహకరించారు. శ్రీరామనవమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం ప్రదర్శించే ఈ రామాయణాన్ని ఆ తర్వాత ఏడాదంతా ప్రత్యేక బ్యాంకులో భద్రపరుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని