Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్‌!

డబ్బు దాచుకొనే, రుణాలు అందించే బ్యాంకుల గురించి తెలిసిందే. శ్రీరాముడి పేరుతో ఏర్పాటై.. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంకు గురించి మీకు తెలుసా? ఈ బ్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది.

Updated : 31 Mar 2023 08:20 IST

డబ్బు దాచుకొనే, రుణాలు అందించే బ్యాంకుల గురించి తెలిసిందే. శ్రీరాముడి పేరుతో ఏర్పాటై.. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంకు గురించి మీకు తెలుసా? ఈ బ్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది. ఇప్పటికే 1,942.34 కోట్ల రామ నామాలు ఇక్కడ ఉన్నాయంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. త్రిపుర భైరవి ప్రాంతంలోని మీర్‌ఘాట్‌లో ఈ బ్యాంకు ఉంది. దీన్ని మెహ్రోత్రా కుటుంబం గత 96 ఏళ్లుగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా వందలాది భక్తులు ఇక్కడికి వచ్చి ఖాతాలు ప్రారంభిస్తుంటారని నిర్వాహకుడు సుమిత్‌ మెహ్రోత్రా చెబుతున్నారు.

‘‘రామ్‌ రమాపతి బ్యాంక్‌ 1926లో మా తాతకు తాతైన దాస్‌ చన్నూలాల్‌ ద్వారా ప్రారంభమైంది. ఇది డబ్బులతో పని లేని ఆధ్యాత్మిక బ్యాంకు’’ అని సుమిత్‌ వివరించారు. ఇక్కడ ఖాతాలు ప్రారంభించేవారికి కిల్విష్‌ చెట్టు నుంచి తయారుచేసిన కలం, రామ నామం రాయడానికి కాగితం ఇస్తారు. బ్రహ్మ ముహూర్తంలో అంటే.. ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య రామ నామాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు లక్షా 25 వేల రామ నామాలు రాసి మళ్లీ ఈ బ్యాంకులో జమ చేయాలి. ఇందుకు ఖాతాదారులకు 250 రోజుల సమయం ఇస్తారు. రామ నామాలు రాస్తున్న సమయంలో ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారంతోపాటు బయటి నుంచి తెచ్చిన ఆహారం తినకూడదనే నియమం ఉంది. ఇలా చేస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, జపాన్‌ దేశాల్లో ఉండేవారు సైతం ఇక్కడ ఖాతాలు తెరుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు