పెరుగు వివాదానికి తెర
కేంద్రం, రాష్ట్రాల మధ్య ‘పెరుగు’పై నెలకొన్న వివాదానికి తెరపడింది. హిందీ పదం ‘దహీ’కి బదులుగా ‘కర్డ్’ అని వాడుకోవచ్చని గురువారం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అనుమతిచ్చింది.
హిందీ పదం ‘దహీ’ ఉపసంహరణ
నిబంధనలను సవరించిన ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ
దిల్లీ, చెన్నై, బెంగళూరు: కేంద్రం, రాష్ట్రాల మధ్య ‘పెరుగు’పై నెలకొన్న వివాదానికి తెరపడింది. హిందీ పదం ‘దహీ’కి బదులుగా ‘కర్డ్’ అని వాడుకోవచ్చని గురువారం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అనుమతిచ్చింది. రాష్ట్రాల నుంచి ‘దహీ’కి తీవ్ర వ్యతిరేకత రావడంతో సంస్థ దిగొచ్చింది. కర్ణాటక, తమిళనాడుల్లోని పాల సహకార సంఘాలు, ప్రైవేటు డైరీలు ‘కర్డ్’కు బదులుగా ‘దహీ’ అని వాడాలని, బ్రాకెట్లలో ఆయా స్థానిక భాషల్లో వాడే పదాలను ఉంచాలని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మార్చి 10వ తేదీన ఆదేశాలిచ్చింది. అంటే పెరుగు ప్యాకెట్లపై ‘దహీ (కర్డ్-ఇంగ్లిష్), దహీ (మోసారు-కన్నడ), దహీ (తాయిర్-తమిళం), దహీ (పెరుగు-తెలుగు) అని వాడాలని సూచించింది. దీనిపై కర్ణాటక, తమిళనాడుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఇది హిందీ దండయాత్రే: డీఎంకే, జేడీఎస్
స్థానిక భాషలతోపాటు ‘కర్డ్’కు బదులుగా ‘దహీ’ వాడాలన్న ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఆదేశాలు ‘హిందీ’ని రుద్దడానికేనని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ మండిపడ్డాయి. తమిళనాడు ‘నహీ టు దహీ’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. పెరుగు ప్యాకెట్లపై ‘దహీ’ అనే పదం వాడేదిలేదని తమిళనాడు ప్రభుత్వ పాల సరఫరాదారు ‘ఎవిన్’ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందీ పదాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఆ రాష్ట్ర భాజపాశాఖ కూడా ‘దహీ’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. డీఎంకే నేతలూ ‘దహీ నహీ పోడా’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో హిందీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి ‘దహీ’ పదంపై మండిపడ్డారు. కన్నడిగులపై ‘హిందీ’ని రుద్దడానికి ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నందిని బ్రాండును మార్చి హిందీని అమలుచేయడమేమిటని ప్రశ్నించారు. నందిని బ్రాండు కన్నడిగుల ఆస్తి అని, ఆ గుర్తింపును మార్చాలనుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలు పాల ఉత్పత్తిదారుల సంఘాలూ కేంద్రానికి లేఖలు రాశాయి. సంస్థ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరాయి.
ఎట్టకేలకు వెనక్కి
కర్ణాటక, తమిళనాడుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ దిగొచ్చింది. ‘దహీ’కి బదులుగా ‘కర్డ్’ను, బ్రాకెట్లలో స్థానిక భాషలను వాడవచ్చని గురువారం ఆదేశాలను సవరించింది. తాజా సవరణ ప్రకారం.. కర్డ్ (దహీ-హిందీ), కర్డ్ (మోసారు-కన్నడ), కర్డ్ (తాయిర్-తమిళం), కర్డ్ (పెరుగు-తెలుగు) పదాలను వాడవచ్చని సూచించింది. పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: డిమాండ్ తగ్గే వరకు.. పాస్‌పోర్టుల జారీకి స్పెషల్ డ్రైవ్: బాలయ్య
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Priyanka Chopra: మానసికంగా ఎన్నోసార్లు బాధపడ్డా: ప్రియాంకా చోప్రా
-
World News
Electricity: నేపాల్ నుంచి.. భారత్‌కు విద్యుత్ ఎగుమతి
-
Sports News
Gujarat Titans:గుజరాత్ టైటాన్స్ సక్సెస్ క్రెడిట్ వారికే దక్కుతుంది: అనిల్ కుంబ్లే
-
General News
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు