Thunderstorm: అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు

ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి.

Updated : 31 Mar 2023 07:50 IST

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టం లేకపోయినప్పటికీ పిడుగుపాటు శబ్దాలకు బాసుదేవపూర్‌ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్యుములోనింబస్‌ మేఘాలు రాపిడికి గురైనపుడు ఇలా జరుగుతుందని గోపాల్‌పూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ గురువారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయని తెలిపారు. ప్రతి పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్‌ కేంద్రానికి ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని