విమానంలో మద్యం తాగి వాంతులు, మల విసర్జన

ఎయిరిండియాలో మూత్రవిసర్జన ఘటన మరువకముందే ఇండిగో విమానంలో మరో దుశ్చర్య చోటుచేసుకుంది.

Published : 31 Mar 2023 04:53 IST

దిల్లీ: ఎయిరిండియాలో మూత్రవిసర్జన ఘటన మరువకముందే ఇండిగో విమానంలో మరో దుశ్చర్య చోటుచేసుకుంది. మార్చి 26న గువాహటి నుంచి దిల్లీ వెళుతున్న విమానంలో ఓ వ్యక్తి తప్పతాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. టాయిలెట్‌ వద్ద మలవిసర్జన కూడా చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ‘‘మీ సహనానికి జోహార్లు’’ అంటూ అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది సిబ్బంది శుభ్రం చేస్తున్న ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది. ఈ ట్వీట్‌ చూసిన యూజర్లు సంఘటనపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విమానాల్లో పదే పదే ఇలా జరుగుతుండటం దారుణమని, ఈ సమస్యను అరికట్టాలంటే విమానాల్లో మద్యం నిషేధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని