షికారీలను అడ్డుకున్న సినిమాహాల్‌ సిబ్బంది: వీడియో వైరల్‌

సంచార జీవులైన షికారీలను సినిమా థియేటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటన తమిళనాట చర్చనీయాంశమైది.

Updated : 31 Mar 2023 05:32 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: సంచార జీవులైన షికారీలను సినిమా థియేటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘటన తమిళనాట చర్చనీయాంశమైది. నటుడు శింబు నటించిన ‘పత్తుతల’ సినిమా గురువారం విడుదలైంది. సినిమా చూసేందుకు చెన్నై కోయంబేడులోని రోహిణి థియేటర్‌కు షికారీ వర్గానికి చెందిన వారు వచ్చారు. థియేటర్‌లోకి వెళ్తుండగా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవడంతో పలువర్గాల నుంచి  విమర్శలు వ్యక్తమయ్యాయి. థియేటర్‌ యాజమాన్యం స్పందిస్తూ... షికారీలు చిన్న పిల్లలతో గుంపుగా వచ్చారని, వారి వల్ల ఇతర ప్రేక్షకులు అసౌకర్యానికి గురవతారని భావించి మొదట థియేటర్‌లోకి అనుమతివ్వలేదని, తర్వాత లోపలికి పంపినట్లు పేర్కొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని