సిసోదియాకు చుక్కెదురు.. బెయిల్‌ మంజూరుకు కోర్టు నిరాకరణ

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు శుక్రవారం న్యాయస్థానంలో చుక్కెదురైంది.

Published : 01 Apr 2023 04:22 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు శుక్రవారం న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు ఇక్కడి రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. అబ్కారీ విధానాల రూపకల్పన, అమలులో సిసోదియా కీలక పాత్ర పోషించారని, కాబట్టి నేరపూరితకుట్రలో అతడికి భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టమవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆయనకు ఇప్పుడు బెయిల్‌ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున ఆయన అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు