ఆరు రాష్ట్రాల్లో చెలరేగిన హింస

శ్రీరామ నవమి సందర్భంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో చెలరేగిన హింస కారణంగా ఇద్దరు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.

Published : 01 Apr 2023 04:22 IST

మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్లో మరొకరి మృతి

కోల్‌కతా, ముంబయి: శ్రీరామ నవమి సందర్భంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో చెలరేగిన హింస కారణంగా ఇద్దరు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇరువర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, మలద్‌, జల్‌గావ్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గురువారం గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన ఓ బాధితుడు మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గొడవలకు సంబంధముందని భావిస్తున్న సుమారు 65 మందిని పోలీసులు అరెస్టు చేసి అభియోగపత్రాలు నమోదు చేశారు. పశ్చిమబెంగాల్లోని హావ్‌డా, దల్‌ఖోలా ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. పలు వాహానాలను తగులబెట్టారు. దల్‌ఖోలాలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో ఓ వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. గుజరాత్‌ వడోదరలోని ఫతేపురా ప్రాంతంలో రెండు రామనవమి ఊరేగింపుల సందర్భంగా పలువురు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. 25 మందిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు