Punjab: గుర్రాల పెంపకంతో భలే ఆదాయం

పంజాబ్‌కు చెందిన గుర్‌తేజ్‌ సింగ్‌ అనే రైతు గుర్రాల వ్యాపారంతో రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా స్టడ్‌ ఫామ్‌(అశ్వాల పెంపకం)ను నిర్వహిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.

Published : 01 Apr 2023 07:53 IST

పంజాబ్‌ రైతు వినూత్న పంథా

పంజాబ్‌కు చెందిన గుర్‌తేజ్‌ సింగ్‌ అనే రైతు గుర్రాల వ్యాపారంతో రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా స్టడ్‌ ఫామ్‌(అశ్వాల పెంపకం)ను నిర్వహిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇందులో చాలా తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. బఠిండా జిల్లాలోని నరువానా గ్రామానికి చెందిన గుర్‌తేజ్‌ తొలుత రూ.లక్షన్నరతో రెండు గుర్రాలను కొన్నారు. వాటి పిల్లల్లో కొన్నింటిని విక్రయిస్తూ వచ్చారు. ఇప్పుడు అతడి వద్ద 8 గుర్రాలు ఉన్నాయి. స్టడ్‌ ఫార్మింగ్‌ వ్యాపారంలో ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని గుర్‌తేజ్‌ చెప్పారు. రోజుకు ఒక్కో గుర్రానికి మేత ఖర్చు సుమారు రూ.200 మాత్రమే అవుతుందన్నారు. గుర్రాలు శెనగలు, జీలకర్ర తింటాయని.. వీటిని రైతులే తమ పొలాల్లో పండించుకోవచ్చని పేర్కొన్నారు. పంజాబ్‌లో ప్రతినెలా జరిగే గుర్రాల సంతలో గుర్‌తేజ్‌ తన అశ్వాలను విక్రయిస్తాడు. ఇక్కడ ఒక్కో గుర్రం దాదాపు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతుంది. గుర్రాలకు రోగాల ముప్పూ తక్కువేనని గుర్‌తేజ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని