ఇంకా చిక్కని అమృత్‌పాల్‌

ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌.. ఇంకా చిక్కలేదు. అతడి కోసం పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది.

Published : 01 Apr 2023 04:22 IST

హోశియార్‌పుర్‌: ఖలిస్థాన్‌ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌.. ఇంకా చిక్కలేదు. అతడి కోసం పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. నేపాల్‌ గుండా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన పాల్‌.. అది విఫలమవడంతో ఇప్పుడు తిరిగి పంజాబ్‌లోని హోశియార్‌పుర్‌కు వచ్చినట్లు సమాచారం. ఇక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి చొరబడాలన్నది అమృత్‌పాల్‌ ప్రణాళికగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని, స్థానిక గ్రామాలను జల్లెడ పడుతున్నారు. డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని