మా అమ్మానాన్న విడిపోయారు.. ఈ విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది
‘నా తల్లిదండ్రులు విడిపోయిన విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది. మా నాన్న ఒక ఆర్మీ క్లబ్ ముందు పుస్తకాలు అమ్మేవారు. మా అమ్మ ఇంటింటికీ తిరుగుతూ మసాలా దినుసులు విక్రయించేవారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
దిల్లీ: ‘నా తల్లిదండ్రులు విడిపోయిన విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది. మా నాన్న ఒక ఆర్మీ క్లబ్ ముందు పుస్తకాలు అమ్మేవారు. మా అమ్మ ఇంటింటికీ తిరుగుతూ మసాలా దినుసులు విక్రయించేవారు. నాన్న పెద్దగా చదువుకోలేదు. అమ్మ డిగ్రీ చదివారు. వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలుండేవి. మొదట్లో వారు ఒక గోవుల కొట్టంపైన గదిలో ఉండేవారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరు’ అంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన వ్యక్తిగత విషయాలను వివరించారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’, ‘రామాయణ్’ సీరియల్స్‌లో నటిస్తున్న రోజుల్లో తనకు అబార్షన్ అయ్యిందన్నారు. దాంతో తాను ఎంతో కుంగుబాటుకు గురైనట్లు తెలిపారు. షూట్ నుంచి కాస్త విరామం తీసుకుందామనుకున్నప్పటికీ ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్‌కు వెళ్లినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhya Pradesh rape: వైరల్ వీడియో చూసి, నా బిడ్డను గుర్తించా: బాలిక తండ్రి ఆవేదన
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
FootBall in Asian Games: ఇలాగైతే మమ్మల్ని ఎక్కడికీ పంపొద్దు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఆవేదన
-
KTR: వరి మాత్రమే సరిపోదు.. ఆయిల్‌పామ్ పండించాలి: కేటీఆర్
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..