రాహుల్‌పై మరో పరువు నష్టం కేసు

కాంగ్రెస్‌ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది.

Updated : 02 Apr 2023 06:08 IST

ఆరెస్సెస్‌ కార్యకర్తలను కౌరవులతో పోల్చడంపై అభ్యంతరం

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, ఇటీవల ఎంపీ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఆరెస్సెస్‌ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలకు గాను కమల్‌ బదౌరియా అనే వ్యక్తి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ కోర్టులో దావా వేశారు. జనవరి 9న హరియాణాలోని అంబాలా జిల్లాలో పర్యటించిన రాహుల్‌ ..ఆరెస్సెస్‌ కార్యకర్తలను కౌరవులతో పోల్చారని కమల్‌ బదౌరియా ఆరోపించారు. ‘‘కౌరవులు ఎవరు? మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతా వినండి. వాళ్లంతా ఖాకీ ప్యాంట్లు వేసుకుంటారు. బూట్లు వేసుకొని, చేతిలో లాఠీ పట్టుకుంటారు. దేశంలోని ఇద్దరు ముగ్గురు సంపన్నులు వారికి మద్దతుగా ఉంటారు’’ అంటూ ఆరెస్సెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ వ్యాఖ్యానించారని బదౌరియా పేర్కొన్నారు. ఏప్రిల్‌ 12న హరిద్వార్‌ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు