‘కరి’ గమపదనిస

తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిరాపల్లిలోని ఎంఆర్‌పాళయం శిబిరంలో ఉంటున్న కొన్ని ఏనుగులు మౌత్‌ ఆర్గాన్‌ వంటి సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

Published : 02 Apr 2023 05:18 IST

తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిరాపల్లిలోని ఎంఆర్‌పాళయం శిబిరంలో ఉంటున్న కొన్ని ఏనుగులు మౌత్‌ ఆర్గాన్‌ వంటి సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుచ్చి జిల్లా సిరుగనూరు పక్కనున్న ఎంఆర్‌పాళయంలో 20 ఎకరాల విస్తీర్ణంలో శిబిరాన్ని 2019లో రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసింది. రూపాలి, ఇందు, జయంతి, సంధ్య తదితర తొమ్మిది ఏనుగులు ఇక్కడ సేదతీరుతున్నాయి. వీటిలో రూపాలి, జయంతి పలు విన్యాసాలు చేయడం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఈ రెండు ఏనుగులు మావటీలు చెప్పినట్లు చేయడంతోపాటు తొండంతో మౌత్‌ ఆర్గాన్‌ను పట్టుకుని స్వరాలు పలికిస్తున్నాయి. అటవీశాఖ అధికారి సతీష్‌ నేతృత్వంలో వీటి బాగోగులు చూస్తున్నారు. 

 న్యూస్‌టుడే, గిండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని