జైలు నుంచి సిద్ధూ విడుదల

కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. 1988 నాటి గుర్‌నామ్‌ సింగ్‌ హత్య కేసులో దోషిగా తేలిన ఆయన గడచిన 10 నెలలుగా జైలు శిక్ష అనుభవించారు.

Published : 02 Apr 2023 04:07 IST

ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందన్న కాంగ్రెస్‌ నేత

పటియాలా: కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. 1988 నాటి గుర్‌నామ్‌ సింగ్‌ హత్య కేసులో దోషిగా తేలిన ఆయన గడచిన 10 నెలలుగా జైలు శిక్ష అనుభవించారు. వాస్తవానికి సుప్రీం కోర్టు ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్షను విధించింది. ఆయన సత్ప్రవర్తన కారణంగా మరో రెండు నెలల శిక్షాకాలం మిగిలి ఉండగానే సిద్ధూ జైలు నుంచి విడుదలయ్యారు. కారాగారం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం సంకెళ్లలో బందీగా ఉందని, దర్యాప్తు సంస్థలు బానిసలుగా మారాయని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని