మూడు నెలలు మండుడే..!

దేశంలో మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయి. దక్షిణ, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా చాలాచోట్ల ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలల మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం ప్రకటించింది.

Updated : 02 Apr 2023 06:01 IST

ఏప్రిల్‌-జూన్‌ మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు
భారత వాతావరణ శాఖ ప్రకటన

దిల్లీ: దేశంలో మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయి. దక్షిణ, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా చాలాచోట్ల ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలల మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో తూర్పు, మధ్య, వాయవ్య భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రధానంగా బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీచవచ్చని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) వెల్లడించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు కురిసినా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటుండగా మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ప్రకటన పిడుగు లాంటి వార్తే అని చెప్పొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని