వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార

మహారాష్ట్రలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఉల్లిపాయలు కోయడానికి వెళ్లిన దాదాపు 15 మంది వ్యవసాయ కూలీల కళ్ల నుంచి చిన్నచిన్న పురుగులు, వాటి గుడ్లు వచ్చాయి.

Updated : 02 Apr 2023 07:18 IST

మహారాష్ట్రలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఉల్లిపాయలు కోయడానికి వెళ్లిన దాదాపు 15 మంది వ్యవసాయ కూలీల కళ్ల నుంచి చిన్నచిన్న పురుగులు, వాటి గుడ్లు వచ్చాయి. భయాందోళనలకు గురైన వీరంతా ఆసుపత్రుల్లో చేరారు. అహ్మద్‌నగర్‌ జిల్లా రాహురి ప్రాంతంలోని వాలన్‌ గ్రామ పొలంలో ఉల్లిపాయలు కోస్తుండగా.. అందరికీ ఒక్కసారిగా కళ్లలో మంటలు వచ్చాయి. వైద్యుడి వద్దకు వెళితే ఏవో కొన్ని మందులిచ్చి ఇళ్లకు పంపించారు. అదే రోజు రాత్రి సమస్య మళ్లీ మొదటికి రావడంతో మరుసటి రోజు కూలీల్లో కొందరు రాహురి కంటి ఆస్పత్రికి, మరికొందరు అహ్మద్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. వారి కళ్లలో నుంచి పురుగులు, వాటి గుడ్లు వస్తున్నట్లు గమనించారు. కంటి పరీక్షలకు సంబంధించిన పూర్తి నివేదికలు వచ్చిన తర్వాత వారి ఆరోగ్య సమస్య గురించి కచ్చితంగా చెప్పగలమని వైద్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు