Kamal Anand: రూ.60 కోసం పదేళ్లు పోరాటం

దిల్లీకి చెందిన ఓ వ్యక్తి 60 రూపాయల కోసం పదేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించాడు.

Updated : 02 Apr 2023 08:13 IST

దిల్లీ: దిల్లీకి చెందిన ఓ వ్యక్తి 60 రూపాయల కోసం పదేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించాడు. ఫిర్యాదుదారుడు కమల్‌ ఆనంద్‌ దక్షిణ దిల్లీలో నివాసం ఉండేవాడు. 2013లో సాకేత్‌ డిస్ట్రిక్ట్‌ సెంటర్‌లో ఉన్న ఓ మాల్‌లోని కోస్టా కాఫీ ఔట్‌లెట్‌లో కాఫీ తాగేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. కాఫీ తాగితే పార్కింగ్‌ ఉచితం అని చెబుతూ అక్కడి ఉద్యోగి వారికి ఆఫర్‌ స్లిప్‌ ఇచ్చారు. దీంతో వారు కాఫీలు తాగి కారును పార్కింగ్‌ నుంచి బయటకు తీసేందుకు వెళ్లగా.. అక్కడి నిర్వాహకుడు రూ.60 పార్కింగ్‌ ఫీజు చెల్లించాలని కోరాడు. వెంటనే కాఫీ షాప్‌లో తనకు వచ్చిన ఫ్రీ పార్కింగ్‌ ఆఫర్‌ టికెట్‌ను.. నిర్వాహకుడికి కమల్‌ చూపించాడు. అయినా పార్కింగ్‌ ఫీజు రూ.60 చెల్లించాల్సిందేనని అతడు స్పష్టం చేశాడు. దీంతో పార్కింగ్‌ ఫీజు చెల్లించి కమల్‌ బయటకు వచ్చేశాడు. అనంతరం, దక్షిణ దిల్లీలోని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో ఇందుకు సంబంధించి కేసు దాఖలు చేశాడు. విచారణ పదేళ్ల పాటు సాగింది. ‘కస్టమర్లకు ముందుగా ఆఫర్ల గురించి చెప్పి.. వారికి ఆ సేవలు అందించకుండా తిరస్కరించడం నిర్లక్ష్యం కిందకే వస్తుంది’ అని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై రూ.61,201 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కమల్‌కు చెల్లించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని