బైక్‌పై మినీ కిచెన్‌.. రెండు దేశాల్లో పర్యటించిన కేరళ యువకుడు

కేరళకు చెందిన జిబిన్‌ మధు అనే యువకుడు వినూత్నంగా ఒంటరి ప్రయాణం చేస్తున్నారు.

Updated : 07 Apr 2023 07:26 IST

కేరళకు చెందిన జిబిన్‌ మధు అనే యువకుడు వినూత్నంగా ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. బైక్‌పై చిన్న వంటశాల ఏర్పాటు చేసుకుని ఆహారం విక్రయిస్తూ 10 రాష్ట్రాలు, 2 దేశాల మీదుగా ప్రయాణించారు. 16 నెలల 17 రోజులపాటు ఈ పర్యటన సాగింది. త్వరలో థాయ్‌లాండ్‌కూ వెళ్లనున్నారు. కొట్టాయంలోని పాలా ప్రాంతానికి చెందిన జిబిన్‌కు ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా పర్యటించాలనే కోరిక ఉండేది.  2021 ఏప్రిల్‌ 1న ఇంట్లో నుంచి బయల్దేరారు. ఆ సమయంలో జిబిన్‌వద్ద రూ.5వేలే ఉన్నాయి. పర్యటన ప్రారంభించాక ఆర్థిక వనరుల కోసం ఒక్కోచోట ఒక్కో పని చేసుకుంటూ గడిపారు జిబిన్‌. ఇలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, మహారాష్ట్ర, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా జిబిన్‌ పయనించారు. సరిహద్దులను దాటి నేపాల్‌, మయన్మార్‌లోనూ పర్యటించారు. వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవడం కష్టమైన నేపథ్యంలో.. జిబిన్‌ సరికొత్త ఆలోచన అమలు చేశారు. తనవద్ద ఉన్న వనరులనే ఉపయోగించుకుని బైక్‌పై వంటశాల ఏర్పాటు చేశారు. నూడుల్స్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటివి వండి.. పర్యాటకులకు విక్రయించడం ప్రారంభించారు. టీ సైతం విక్రయించేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని