Rahul Gandhi: లాలూ అద్భుతంగా వంట చేస్తారు: రాహుల్‌గాంధీ

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అద్భుతంగా వంట చేస్తారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు.

Updated : 24 Apr 2023 08:08 IST

దిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అద్భుతంగా వంట చేస్తారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. అయితే వంట విషయంలో అందరికంటే తన తల్లి, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీయే నంబర్‌-1 అని ఆయన పేర్కొన్నారు. తన ఆహార అలవాట్లతో పాటు పలు అంశాలపై ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో ముఖాముఖిలో రాహుల్‌ మాట్లాడారు. తల్లి సోనియా వంట తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు అంతగా నచ్చదని పేర్కొన్నారు. తన దృష్టిలో అత్యుత్తమంగా వంట చేసేవారిలో రెండో స్థానం ప్రియాంకదేనని చెప్పారు. ఉదయం కాఫీ తాగుతానని, రాత్రిళ్లు చాయ్‌ తాగేందుకు ఇష్టపడతానని తెలిపారు. ఫ్రాన్స్‌ స్వీట్ల కన్నా భారతీయ మిఠాయిలకే ప్రాధాన్యమిస్తానన్నారు. ఘాటైన ఆహార పదార్థాల కంటే తీపి పదార్థాల వైపే మొగ్గు చూపుతానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని