అతిథి మర్యాదలు చేసే రోబో.. తయారీ ఖర్చు రూ.2 వేలు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేబాశిష్‌ దత్తా అనే యువకుడు పనికిరాని వస్తువులతో రోబోను రూపొందించాడు. ఇంటికి వచ్చిన అతిథులకు ఆహారం, నీళ్లు అందించడం సహా వివిధ పనులు చేసిపెట్టేలా ఈ మరమనిషిని తీర్చిదిద్దాడు.

Updated : 28 Apr 2023 14:28 IST

పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేబాశిష్‌ దత్తా అనే యువకుడు పనికిరాని వస్తువులతో రోబోను రూపొందించాడు. ఇంటికి వచ్చిన అతిథులకు ఆహారం, నీళ్లు అందించడం సహా వివిధ పనులు చేసిపెట్టేలా ఈ మరమనిషిని తీర్చిదిద్దాడు. దీని తయారీకి రూ.2 వేలు ఖర్చు అయిందని తెలిపాడు. అవార్డు ఫంక్షన్లలో దీని చేతుల మీదుగా పురస్కారాలు కూడా ప్రదానం చేయొచ్చని దేబాశిష్‌ చెబుతున్నాడు. పాలిటెక్నిక్‌  రెండో ఏడాది చదువుతున్న దేబాశిష్‌ రెండు నెలలు శ్రమించి ఈ రోబోను తయారుచేశాడు. సీ-ప్రోగ్రామింగ్‌ సహాయంతో కోడింగ్‌ చేశాడు. రోబోకు ‘బిధు శేఖర్‌’ అని పేరు పెట్టాడు. ఈ రోబోకు నాలుగు చక్రాలు అమర్చి.. బ్లూటూత్‌తో అనుసంధానం చేశాడు. రోబోను నియంత్రించడానికి రిమోట్‌ యాప్‌ను రూపొందించాడు. మొబైల్‌ ఫోన్‌లోని ఆ యాప్‌ ద్వారా రోబోను కదిలించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని