Traveller: పైసల్లేవని.. లద్దాఖ్‌కు 2,401 కి.మీ. నడిచాడు

ప్రయాణాలపై మక్కువ ఉన్న ప్రతి బైకర్‌.. జీవితంలో ఒక్కసారైనా లేహ్‌ - లద్దాఖ్‌ ట్రిప్పు వెళ్లాలని కలలు కంటారు.

Updated : 29 Apr 2023 07:08 IST

ప్రయాణాలపై మక్కువ ఉన్న ప్రతి బైకర్‌.. జీవితంలో ఒక్కసారైనా లేహ్‌ - లద్దాఖ్‌ ట్రిప్పు వెళ్లాలని కలలు కంటారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ఆసన్‌సోల్‌ నగరానికి చెందిన దెబు ముఖర్జీ కూడా అలాగే ఆలోచించాడు. ఈ మధ్య స్నేహితులంతా ద్విచక్ర వాహనాలపై లద్దాఖ్‌ వెళ్లి వచ్చారు. ఆ సమయంలో వారితో వెళ్లాలని అనుకొన్నా.. బైక్‌ లేదని వెళ్లలేదు. ఎలక్ట్రిక్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న దెబు ముఖర్జీ వద్ద ద్విచక్ర వాహనం కొనేటంత డబ్బుల్లేవు. అయితే, తానూ లద్దాఖ్‌ చూడాలన్న కోరిక మాత్రం బలీయంగా ఉంది. దీంతో తన స్వస్థలం నుంచి కాలినడకనే బయలుదేరాడు. 72 రోజులపాటు.. 2,401 కిలోమీటర్లు నడిచాక లద్దాఖ్‌ చేరుకొని మంచుకొండల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇటీవలే ఇంటికి చేరుకున్న దెబు తన అనుభవాలు వివరిస్తూ ‘‘చాలా రోజులు ఆకలితోనే నడిచా. స్నేహితులు డబ్బులు పంపితే ఆహారం కొనుక్కొని తిన్నా. రోడ్ల పక్కన తోపుడుబండ్ల మీద రాత్రిళ్లు నిద్రించా. అడవి జంతువులను చూసినపుడు భయమేసేది. చివరకు అనుకున్నది సాధించా’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని