Govt of Gujarat: ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్‌నే వాడాలి.. గుజరాత్‌ సర్కారు ఆదేశాలు

ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి ‘జియో’ సర్వీసులను మాత్రమే వినియోగించాలని గుజరాత్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Updated : 10 May 2023 08:06 IST

ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి ‘జియో’ సర్వీసులను మాత్రమే వినియోగించాలని గుజరాత్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వాడుతున్న వొడాఫోన్‌ - ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఆ నంబర్లను రిలయన్స్‌ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్‌పెయిడ్‌ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు ‘జియో’ సైతం ప్రకటించింది. గుజరాత్‌ ప్రభుత్వం, రిలయన్స్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా 4జీ సర్వీసులతో లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని