ఉక్రెయిన్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌

కొవిడ్‌, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతూ భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులు రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య సంఘం తెలిపింది.

Published : 12 May 2023 03:56 IST

చివరి ఏడాదిలో వచ్చిన వారికి వర్తింపు

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతూ భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులు రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య సంఘం తెలిపింది. 2022 జులై 28న జారీ చేసిన పబ్లిక్‌ నోటీసులోని రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ నిబంధన కేవలం వీరికే వర్తిసుందని స్పష్టం చేసింది. ఈ విద్యార్థులు ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎఫ్‌ఎంజీ) పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత రెండేళ్లపాటు మెడికల్‌ కాలేజీతో అనుసంధానమైన ఆసుపత్రిలో కంపల్సరీ రొటేటింగ్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌ (సీఆర్‌ఎంఐ) చేయాలని స్పష్టం చేసింది. స్థానికత (డొమిసైల్‌) ఆధారంగా రాష్ట్ర మెడికల్‌ కౌన్సిళ్లు ఏ విదేశీ విద్యార్థికీ తమ పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్‌ తిరస్కరించకూడదని పేర్కొంది. అర్హత సాధించి ఉంటే దేశంలోని ఏ రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలోనైనా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయొచ్చని స్పష్టం చేసింది. ఇలా ఇంటర్న్‌షిప్‌ చేయడానికి అర్హమైన కాలేజీలు/విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో 30 ఉన్నట్లు తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని