Agniveer: అగ్నివీర్‌లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌.. వయో పరిమితిలోనూ సడలింపు

అగ్నివీర్‌లకు రైల్వేలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15% రిజర్వేషన్‌ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

Published : 12 May 2023 09:51 IST

దిల్లీ: అగ్నివీర్‌లకు రైల్వేలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15% రిజర్వేషన్‌ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులు (పర్సన్‌ విత్‌ బెంచ్‌మార్క్‌ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్‌ అప్రంటీస్‌ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్‌-1లో 10%, లెవెల్‌-2.. అంతకుమించిన నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్‌ను అగ్నివీర్‌లకు కల్పిస్తారు. తొలిబ్యాచ్‌ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు. నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్‌ మేనేజర్లకు రైల్వేబోర్డు లేఖలు పంపింది. భర్తీకాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది. అగ్నివీర్‌ల కోసం రిజర్వేషన్‌ విధానాన్ని ఆర్‌పీఎఫ్‌ కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని