కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్‌ పోలీసింగ్‌

దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్‌ నిఘావ్యవస్థను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం ప్రారంభించారు.

Published : 12 May 2023 03:56 IST

దేశంలోనే తొలిసారి

తిరువనంతపురం: దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్‌ నిఘావ్యవస్థను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20 జిల్లాల పోలీసులకు ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్‌ పైలట్లకు లైసెన్సులు పంపిణీ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ.. పోలీసు బలగాల ఆధునికీకరణలో దేశంలోనే కేరళ ముందంజలో ఉందన్నారు. డ్రోన్‌ ఆపరేషన్‌పై ప్రత్యేక శిక్షణ కోసం 25 మంది పోలీసు సిబ్బందిని మద్రాస్‌ ఐఐటీకి పంపారు. మరో 20 మందికి కేరళలోని డ్రోన్‌ ల్యాబ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. యాంటీ డ్రోన్‌ వ్యవస్థ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోగలదని, ప్రత్యర్థుల డ్రోన్లను నాశనం చేయగలదని  సైబర్‌డోమ్‌ నోడల్‌ అధికారి, ఐజీ ప్రకాశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని