Cyber Crime: ఫోన్‌లో హిప్నటైజ్‌ చేసి రూ.40వేలు స్వాహా!

ఫోన్‌లో మాటలతో తనను హిప్నటైజ్‌ చేసిన ఓ వ్యక్తి రూ.40 వేలు కాజేశాడని ఓ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 12 May 2023 06:48 IST

పోలీసులకు జర్నలిస్టు ఫిర్యాదు
సైబర్‌ నేరగాళ్ల పనేనన్న నిపుణులు

దిల్లీ: ఫోన్‌లో మాటలతో తనను హిప్నటైజ్‌ చేసిన ఓ వ్యక్తి రూ.40 వేలు కాజేశాడని ఓ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అది హిప్నటైజ్‌ కాదని, తరచుగా జరుగుతున్న సైబర్‌ మోసాల తరహా ఘటనేనని పోలీసులు, సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దిల్లీలో రమేశ్‌ కుమార్‌ రాజా అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు తాను హిప్నటైజ్‌కు గురై రూ.40 వేలు పోగొట్టుకున్నానంటూ ఏప్రిల్‌ 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘ఒక వ్యక్తి నాకు ఫోన్‌ చేసి అతడికి నేను బాగా తెలిసినట్లుగా మాట్లాడాడు. తను నా పాత స్నేహితుడినని నమ్మించాడు. అతడి మాటలు విన్నాక నేను తర్కంతో ఆలోచించే శక్తిని కోల్పోయినట్లు అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నన్ను మాటల్లో ముంచి పేటీఎం ద్వారా నా బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.20వేలు చొప్పున రెండు సార్లు డబ్బు కాజేశాడు’’ అని రాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫోన్‌లో హిప్నటైజ్‌ చేయడం సాధ్యం కాదని హిప్నాటిజంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని