ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో.. రూ.25 కోట్లు లంచం అడిగిన వాంఖడే!

మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Updated : 13 May 2023 15:14 IST

ఎన్‌సీబీ అధికారిపై సీబీఐ కేసు
ఆయనకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు

దిల్లీ: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు వాంఖడేతోపాటు మరో నలుగురు రూ.25కోట్లు లంచం డిమాండ్‌ చేశారన్న అభియోగాలతో ఈ చర్య చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం సీబీఐ అధికారులు ముంబయి, దిల్లీ, రాంచీ, కాన్పుర్‌లలో వాంఖడేకు చెందిన 29 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. వాంఖడే జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2021 అక్టోబరులో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించిన కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాంఖడే లంచం కింద అడ్వాన్సుగా రూ.50లక్షలు స్వీకరించినట్లు సీబీఐకి సమాచారం అందింది. మరోవైపు డ్రగ్స్‌ పార్టీ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎన్‌సీబీ ఆ తర్వాత క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని